ఈతరం భారతం/హనుమకొండ/ అక్టోబర్ 31:
సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి సిద్దిపేట జిల్లా నుంచి పెళ్లి వాహనం బొలెరోను హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా బోర్వెల్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డబోయిన స్వప్న (17), రెడ్డబోయిన కళమ్మ(55), రెడ్డబోయిన శ్రీనాథ్ (06) మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో సిద్దిపేట జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన అబ్బాయికి కురవి వీరభద్ర స్వామి దేవస్థానంలో మూడు రోజుల క్రితం వివాహం జరిగింది
.














