EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ విద్యార్ధులకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వారితో నైపుణ్య శిక్షణ: డాక్టర్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 14

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో చేరిన విధ్యార్థులకు ఉద్యోగావ కాశాలు కల్పిం చెందుకు సామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వారితో ఉచిత నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థి సేవ విభాగ డైరెక్టర్ LSSB, డా. వెంకటేశ్వర్లు తెలిపారు.

అబ్జర్వర్ ఎం రాజ్యలక్ష్మి   ఆదివారం బేగంపేట్ ప్రభుత్వ  మహిళ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షల పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. బీకాం విద్యార్థులందరూ Accountant Assistant, G.ST. లో  శిక్షణ పొందవచ్చు అన్నారు.ఉచిత భోజన సౌంకర్షం కల్పిస్తూ ఈ శిక్షణ  ఇస్తామన్నారు. B.A, B.SC.,   విద్యార్థులకు Basic computers, Software: Hardware , electrical, house wiring, ఇతర విద్యార్థులకు  Advance tailoring, fashion tailoring, జర్దోసి లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందిని సంప్రదించాలని అన్నారు. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్ట్యూట్, భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ గ్రామంలో ఉందన్నారు. శిక్షణ పూర్తి అయిన తరువాత ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు, కోఆర్డినేటర్  డాక్టర్ ఎం రామాచారి  తోపాటు బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top