ఈ తరంభారతం హైదరాబాద్ జూలై 19
ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 3 వరకు పూర్తిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశాలకు గైర్హాజరయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చురుకుగా పనిచేయని వారికి ఛైర్మన్ పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.ఇన్‌చార్జి మంత్రులు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని, జూలై 30న నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే 10 రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ ఇన్‌చార్జీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. బీఎల్‌వో నివేదికలకే పరిమితం కాకుండా బీఎల్‌ఏల నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుని బూత్ స్థాయి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఉత్తమంగా పనిచేసిన 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 489 ఎస్‌ఐఆర్ సమావేశాలు నిర్వహించామని, ఆగస్టు 3 వరకు పొడిగించిన గడువును పూర్తిగా వినియోగించి ప్రజల్లో మరింత విస్తృతంగా చేరుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.















