ఈతరం భారతం జూన్ 13 హైదరాబాద్ :
జూలై 1న ఢిల్లీలో ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ఉత్సవాలకు ఆది లీల ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆదినారాయణ డాక్టర్ వేణు గోపాల చారిని స్వయంగా కలిసి ఆహ్వానించారు వివిధ రాష్ట్రాల లో సేవలందిస్తున్న వైద్యులను సత్కరిస్తున్న సందర్భంగా నాయకుడు మరియు వైద్యుడైన వేణుగోపాల చారి గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగిందని డాక్టర్ ఆదినారాయణ తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఆదిలీల ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీర బొమ్మ రమేష్ మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు కేబీ శ్రీధర్ సామాజికవేత్త కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు















