EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇంటినుండి వెళ్ళినవారు భద్రంగా ఇంటికి చేరండి 

ఈతరం భారతం హైదీరాబాద్ (చిల్కల్గుడా);జనవరి 13

నగర పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మంగళవారం చిల్కల్గుడా ట్రాఫిక్ పోలీస్ ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై అవగాహనా కార్యక్రమం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. జగన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కార్పొరేటర్ హేమ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి మాట్లాడుతూ మనం రోడ్డు పైన వెళుతునమంటే నలు వైపులా గమనించాలి, మద్యం తాగి వాహనాలు నడుపవద్దు, సిగ్నల్స్ ను అతిక్రమించవద్దు ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడుపవద్దు అలాగే పాదచారులు కూడా ఫోన్ మాట్లాడుతూ నడువవద్దని సూచించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహన దారుడు తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టు కొని క్షేమంగా గమ్యం చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ దుర్గారెడ్డి, మరియు ఆటో డ్రైవర్లు. పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top