EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎల్‌ఐసీ ఏజెంట్లకు స్వంత భవనం కోసం ప్రభుత్వ స్థలం కేటాయింపునకు కృషి చేస్తా – టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్

ఈతరంభారతం హైదరాబాద్ జూలై 21

భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య (LIAFI–1964) సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లోని సీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణలోని పాత జిల్లాలైన నిజామాబాద్, మెదక్, సికింద్రాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన 23 బ్రాంచ్‌లు, 14 శాటిలైట్ బ్రాంచ్‌ల నుంచి సుమారు 1,200 మంది జీవిత బీమా ఏజెంట్లు, నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అయిన భారతీయ జీవిత బీమా సంస్థ అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర అమూల్యమని కొనియాడారు. సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్‌కు స్వంత కార్యాలయ భవనం నిర్మించేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేటాయించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ బీమా సంస్థలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రజల విశ్వాసం ఇప్పటికీ ఎల్‌ఐసీపైనే ఉందని పేర్కొన్నారు. జాతీయ నాయకుడు కౌటికె విఠల్ తన సహాధ్యాయుడని, ఆయన ఆహ్వానం మేరకే ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు.

అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎస్.బి. శ్రీనివాసాచారి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సికింద్రాబాద్ డివిజన్ యూనియన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి ఏజెంట్ల ఐక్యత దేశానికి ఆదర్శమని అన్నారు.భారతదేశ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, LIAFI జాతీయ నాయకుడు కౌటికె విఠల్ మాట్లాడుతూ, ఏజెంట్లకు నిరంతర శిక్షణ, వృత్తిపరమైన విద్య, చట్టపరమైన రక్షణ అత్యవసరమన్నారు. ఏజెంట్ల కమిషన్ పరిరక్షణ కోసం LIAFI–1964 మరింత బలంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

మూడేళ్లకోసారి జరిగే ఈ జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మెదక్ జిల్లా సిద్ధిపేట బ్రాంచ్‌కు చెందిన రామస్వామి,ప్రధాన కార్యదర్శిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ బ్రాంచ్‌కు చెందిన గోవింద్ రెడ్డి, కోశాధికారిగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బ్రాంచ్‌కు చెందిన భాస్కర్ ఎన్నికయ్యారు. సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు.

ఈ సమావేశంలో LIAFI–1964 అఖిల భారత కోశాధికారి శ్రీరామ్, సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, LIC సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహూ, మార్కెటింగ్ మేనేజర్ ఎం. ప్రసాద్ రావు, CLIA విభాగం అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ ప్రభాకర్,

అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎస్.బి. శ్రీనివాసాచారి, జాతీయ నాయకుడు కౌటికె విఠల్, సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, LIC సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహూ, మార్కెటింగ్ మేనేజర్ ఎం. ప్రసాద్ రావు, ఇంద్రారెడ్డి, కట్ట వెంకటరెడ్డి, రాజేష్, హేమలత, రామచంద్రారెడ్డి, కిషోర్చందు, యాదగిరిరెడ్డి, గిరిధర్, బుడిగ వెంకటయ్య, దోమకొండ సురేందర్, పుల్లెంల శ్రీనివాస్ గౌడ్, బండి వజ్రారెడ్డి, కప్పోజు సూర్యనారాయణ, పుట్ట వెంకన్న, నాయని రాములు, రాపోలు వెంకటేశ్వర్లు, ఎన్. అమరేందర్ రెడ్డి, ఆవిరినేని విజయలక్ష్మి, అకునూరి రాణి పద్మజ, బి.వి.ఎల్. కాంతారావు, గండు సత్యనారాయణ, ఎ. వీరారెడ్డి, కొండె నరసింహ, రాపోలు శ్రీనివాస్ గౌడ్, వరంగల్ డివిజనల్ కౌన్సిల్ అధ్యక్షులు పులి సుధాకర్, కరీంనగర్ డివిజనల్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top