EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓవరాల్ చాంపియన్‌గా తెలంగాణ

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 5 :

విశాఖపట్నంలో నిర్వహించిన అస్మిత సౌత్ జోన్ కానోయీ స్ప్రింట్ ఛాంపియన్‌షిప్‌లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.

తెలంగాణ జట్టు మొత్తం మూడు బంగారు, మూడు వెండి, ఏడు కాంస్య పతకాలను సాధించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కయాకింగ్–కానోయింగ్ కోచ్ పులి రామకృష్ణ ఆధ్వర్యంలో క్రీడాకారిణులు చందనా, స్రవంతి, సింధు, దివ్యశ్రీ, అవంతిక, నివేదిత, బిందు, జస్విక, రేఖ, అనూష, నాగేశ్వరి, పి. శ్రీవల్లి, ఎం.కే. నిషి తమ ప్రతిభతో పతకాలను గెలుచుకుని తెలంగాణకు కీర్తి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా విజేతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top