ఈతరం భారతం వరంగల్ జూన్ 14 :
కాలేజీ విద్యార్థులకు ఉచిత బస్సు కల్పించాలని, మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత బస్సుల సౌకర్యం తొలగించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థులు గ్రామాల నుంచి చదువుకోవడానికి నగరంలోని హాస్టల్లో చదువుతూ వారి తల్లి తండ్రుల మీద భారమై ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు పిల్లలు హాస్టల్లో ఫీజులు కట్టలేక పోతున్నారు ఇటువంటి పరిస్థితులలో మహిళా ఉద్యోగుల బస్సు సౌకర్యం తొలగించి ఆ స్థానంలో పేద కాలేజీ విద్యార్థులకు ఉచిత బస్సు కల్పించాలని వారి దగ్గరికి వచ్చి చాలామంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు విన్నవించారు వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని రాజనాల శ్రీహరి కోరారు.















