ఈతరంభారతం హైదరాబాద్ అక్టోబర్ 25:
________________________________
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రయాణికులకు ఆర్థిక భార తగ్గించడంతో పాటు సులభతరమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో రూ. 600 ధర కలిగిన ‘వీక్లీ బస్ పాస్’ను ప్రారంభించింది. ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుండి ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనితో అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయాని యాజమాన్యం వెల్లడించింది.















