ఈతరం భారతం వార్తాంశం:
జలమండలికి చేయూతనిస్తున్న ప్రజా ప్రభుత్వం
రూ. 7360 కోట్లతో గోదావరి ప్రాజెక్టు ఫేజ్ – 2&3 పనులకు శ్రీకారం
రూ. 3849.10 కోట్లతో కొత్త 39 ఎస్టీపీల నిర్మాణానికి శంకుస్థాపన
రూ. 27,232 కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధం
నాటికి రోజువారీ సరఫరా, 2047నాటికి 24×7సరఫరా.
TCUR ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ ప్రణాళిక– 2028
కోటిన్నరకు పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ బాధ్యతల్ని జలమండలి నిర్వర్తిస్తుంది. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ.. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు తాగునీరు అందిస్తుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ దాటి టిసీయుఆర్ వరకు (2053 చ.కి.మీ.) విస్తరించింది. ఇక మురుగు శుద్ధి నిర్వహణలోనూ అధునాతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సమర్థ సేవల్ని అందిస్తోంది. ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందిస్తోంది.
హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనంకోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2&3 ప్రాజెక్టు మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల పనులు శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా పయనిస్తోంది.
అలాగే మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంబర్ పేట్ తో పాటు మరో 5 ఎస్టీపీలను మురుగు నీటి శుద్ధి కేంద్రాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థల, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 ఎమ్మెల్డీల సామర్థ్యం గల మొత్తం 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు.
1. గోదావరి ఫేజ్- 2&3 పనులకు శ్రీకారం:
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తోంది. ప్రధానంగా ప్రజలకు అవసరమైన త్రాగునీటి సరఫరాలాంటి మౌలిక సదూపాయాలకు పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంటజలాశయాలను గోదావరినీటితో నింపడానికి రూ. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2&3 ప్రాజెక్టుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో.. అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2,3 లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు.. హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుంది. 2047 నాటికి ఈ సంఖ్య 1114 ఎంజీడీలుగా ఉండనుంది.
గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకంలో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో.. 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం, రెండోది.. మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం చెయ్యడం.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను.. వాప్ కోస్ అనే కంపెనీ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3000 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. అంతేకాకుండా ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు.. ఇతర పనులు చేపట్టారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2&3 ద్వారా 300 ఎంజీడీల నీరు సరఫరా చేస్తారు.
రూ.3849.10 కోట్ల వ్యయంతో.. 39 కొత్త ఎస్టీపీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థల, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 ఎమ్మెల్డీల సామర్థ్యం గల మొత్తం 39 ఎస్టీపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
2. ORR పరిధిలోని ULBల కోసం 39 కొత్త ఎస్టీపీలు:
మాస్టర్ ప్లాన్ ప్రకారం, 2021లో మురుగు ఉత్పత్తి 1950 MLD కాగా, 2036 నాటికి 2800 MLDకు పెరుగుతుంది.
ముసీ నది మరియు చెరువుల్లో కాలుష్యం నివారించేందుకు, అమృత్ -2.0 కింద 39 ఎస్టీపీలు (972 MLD) మంజూరు అయ్యాయి.
ఇవి 2026 నాటికి పూర్తవుతాయి.
అమృత్ -2.0లో భాగంగా ₹3849.10 కోట్లు వ్యయంతో 39 ఎస్టీపీలు (972 MLD) ప్రతిపాదించబడి, నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి ORR పరిధిలోని మురుగు శుద్ధికి ఉపయోగపడతాయి. దీంతో మొత్తం 2850 MLD సామర్థ్యం లభిస్తుంది. ఇది 2036 వరకూ అవసరాలను తీర్చగలదు.
మూసీ నది వెంబడి ట్రంక్ లైన్లు వేసి మురుగు ప్రవాహాన్ని ఆపడానికి DPR సిద్ధమై ఉంది. అంచనా వ్యయం ₹4700 కోట్లు.
TCUR పరిధిలో 2036 నాటికి 100% మురుగు శుద్ధి లక్ష్యంగా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది.
మూసీ నది వెంబడి ఎస్టీపీలు : NRCD Phase–I (2008–09): 592 MLD, అంబర్‌పేట్ – 339 MLD, నాగోల్ – 172 MLD, నల్లచెరువు – 30 MLD, అత్తాపూర్ – 51 MLD.
2024–25లో నిర్మాణం చేపట్టిన ఉన్న ఎస్టీపీలు: 723 MLD : అంబర్‌పేట్ – 212.5 MLD, నాగోల్ – 320 MLD, నల్లచెరువు – 86.5 MLD, అత్తాపూర్-1 – 64 MLD, అత్తాపూర్-2 – 40 MLD
మూసీ పరిధిలో…
మొత్తం సామర్థ్యం (ప్రస్తుతం): 1315 MLD, కొత్త ఎస్టీపీలు (ప్రతిపాదనలో): 234 MLD, నర్సింగీ, సంగం బాపూఘాట్, హైదర్‌శకోట, నల్లచెరువు, పీర్జాదిగూడ, కొర్రేముల.
2027 నాటికి ముసీ వెంబడి మొత్తం సామర్థ్యం: 1549 MLD : మూసీ నది వెంబడి ట్రంక్ లైన్లు వేసి మురుగు ప్రవాహాన్ని ఆపడానికి DPR సిద్ధమై ఉంది. అంచనా వ్యయం ₹4700 కోట్లు.
3. జలమండలి.. భవిష్యత్ ప్రాజెక్టులు- కార్యచరణ:
హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి ప్రతి పౌరునికి సమానంగా, సుస్థిరంగా, 24 గంటల పాటు తాగునీటి మరియు సీవరేజ్ సేవలను అందించే భవిష్యత్తును కలగంటోంది. పై లక్ష్యాల సాధన కోసం క్రింది చర్యలు చేపడుతున్నారు.
జల మండలి పరిధి 1989లో 169 చ.కి.మీ.ల నుండి 2008లో GHMC వరకు 688 చ.కి.మీ.లకు విస్తరించబడింది.
2016లో ఓఆర్ఆర్ వరకు (1450 చ.కి.మీ.) విస్తరించబడింది.
ప్రస్తుతం ఓఆర్ఆర్ దాటి టిసీయుఆర్ వరకు (2053 చ.కి.మీ.) విస్తరించింది.
గత 10 ఏళ్లలో కనెక్షన్లు 8 లక్షల నుండి 14.2 లక్షలకు పెరిగాయి కానీ కొత్తగా నీటి వనరుల పెంపు జరగలేదు. 2027 చివరి నాటికి ప్రతి రోజు నీటి పంపీణీకి కావాల్సిన ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరా జరుగుతోంది.ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో ఒక లక్షకు పైగా కనెక్షన్లు 3–4 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా పొందుతున్నాయి.
నీటి సరఫరా ప్రస్తుత స్థితి :
• ప్రస్తుత నీటి సరఫరా : 602 ఏంజిడీ
• 2027 నాటికి అవసరం : 835 ఏంజిడీ
• సరఫరా లోటు : 233 MGD
• ఈ లోటును మల్లన్నసాగర్ నుండి గోదావరి నీటిని (20 టీఎంసీ – 300 ఏంజిడీ) తీసుకువచ్చి భర్తీ చేయవచ్చు, మరియు మూసి పునరుజ్జీవనం కూడా.
• ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గోదావరి ఫేజ్ II & III ప్రాజెక్ట్ (20టీఎంసీ – మల్లన్నసాగర్ నుండి తాగునీరు) కు రూ. 7360కోట్లు వ్యయంతో పనులు ప్రారంభించింది.
గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ II & II :
• రూ. 7360 కోట్లు వ్యయంతో గోదావరి నుండి 300 ఎంజిడీల తాగునీటి తరలింపు.
• 2.5 TMC నీరు ముసీ నది పునరుద్ధరణకు వినియోగం.
• హైదరాబాదు మరియు TCUR ప్రాంతానికి చెందిన 1.34 కోట్ల జనాభా కు లాభం.
• 2027 డిసెంబర్ నాటికి పూర్తి.
జోన్-II చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మురుగునీటి నెట్వర్క్ను బలోపేతం చేయడం
• చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మురుగునీటి పారుదల నెట్వర్క్ను బలోపేతం చేయడానికి జలమండలి రూ.301 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. వీధుల్లో మురుగు నీటి ప్రవాహాన్ని నిరోధించడంతో పాటు.. మురుగునీటి నెట్వర్క్ బలోపేతం చేయడం ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రాజెక్ట్ అమలు వ్యవధి 2 సంవత్సరాలు.
GHMCలో సేవర్ నెట్వర్క్ ప్రాజెక్ట్
• కోర్ సిటీ & పెరిఫెరల్ సర్కిల్లు అన్ని కలిపి.. GHMC ఏరియాలో నాలాల ద్వారా మురుగు ప్రవాహాలను నిరోధించడానికి 2656 కి.మీ పొడవున ట్రంక్ మురుగు కాలువలు, బ్రాంచ్ మురుగు కాలువలు & సేకరణ నెట్వర్క్లను వేయడానికి డీపీఆర్ లను జలమండలి సిద్ధం చేసింది. దీనికి అయ్యే వ్యయం రూ.6677 కోట్లు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.
ఉస్మాన్సాగర్ & హిమాయత్సాగర్ రిజర్వాయర్ల వద్ద STP ప్రాజెక్ట్
• ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్ల నీటి నాణ్యతను కాపాడేందుకు, ఎగువ ప్రాంతాలలో ఉత్పత్తయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఇక్కడ ఎస్టీపీలు నిర్మించడానికి జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు కింద, ఉస్మాన్సాగర్లో 9 ఎంఎల్డిల సామర్థ్యం గల 2 ఎస్టిపిలు.. హిమాయత్సాగర్ వద్ద 11 ఎంఎల్డిల సామర్థ్యం గల 2 ఎస్టిపిల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.82.83 కోట్లు. అమలు వ్యవధి 2 సంవత్సరాలు.
• మురుగునీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టుల తక్షణ అమలుకు దాదాపు రూ.16,171.93 కోట్లు ఖర్చు అవుతుంది. 2050 ఏళ్ల అవసరాల కోసం తగ్గట్లు DPRలు తయారీ చేశారు.
• జలమండలి ద్వారా నిర్మించే మొత్తం తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.27,231.93 కోట్లు.
కొకాపేట్ నీయోపోలిస్ లేఅవుట్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ :
• సంపు, పంపు హౌస్, GLSR నిర్మాణం.
• ప్రాజెక్ట్ వ్యయం: రూ. 298 కోట్లు.
కొత్తగా ఆమోదించిన నీటి సరఫరా ప్రాజెక్టులు :
• మహేంద్ర హిల్స్ (5 ML) వద్ద GLSR
• ఆస్మాన్‌గఢ (7.5 ML) వద్ద GLSR
• వ్యయం : రూ. 30 కోట్లు
• గత 1 సంవత్సరంలో ప్రభుత్వం నీటి సరఫరా ప్రాజెక్టులకు మొత్తం రూ. 7688 కోట్లు ఆమోదించింది.
కొత్త పథకాలు – ప్రణాళిక (నీటి సరఫరా) :
• మంజీర వాటర్ సప్లై నెట్‌వర్క్ పునరుద్ధరణ – రూ. 722 కోట్లు.
• ఉస్మాన్ సాగర్ కండూట్ పునరుద్ధరణ, 21 MGD అదనపు లైన్ – రూ. 282 కోట్లు.
• రేడియల్ రింగ్ మెయిన్ &లింక్స్ (140 కి.మీ + 98 కి.మీ) – రూ. 8000 కోట్లు.
• TCUR ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ ప్రణాళిక – 2028నాటికి రోజువారీ సరఫరా, 2047నాటికి 24×7సరఫరా.
………















