ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 10
అన్నమయ్య సంకీర్తనలు 12 గంటలపాటు నిర్విరామంగా ఈ రోజు నగరంలోని త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. మధురమి మ్యూజికల్ ఈవెంట్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆధ్వర్యంలో 12 గంటలపాటు అన్నమయ్య ప్రసిద్ధ సంకీర్తనలు ఘనంగా జరిగాయి. అన్నమయ్య పాటలు లోని ముఖ్యమైన ప్రజారంజకమైన మొత్తం 111 పాటలను శ్రీమతి కొణిదెల రాధ మరియు శ్రీమతి పింగళి అరుణ లు కలసి అత్యద్భుతంగా ఆలపించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాటలాడుతూ భక్తి పారవశ్యంలో తో పాడిన వారిని నందించారు. పాతతరం కలలను, సాహిత్యాన్ని ప్రస్తుత తరానికి అందించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమలో శ్రీమతి సంయుక్త,జీనియస్ ప్రతినిధ బింగి నరేంద్ర గౌడ్, సత్యం,కృష్ణ మూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.















