ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 9
ట్యూబెక్టమీ వికటించి మృతిచెందిన కేసులో 8 లక్షల పరిహారంతో పాటు మృతురాలి భర్తకు ఉపాధి కల్పించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. H.R.C. No.2355 of 2018 కేసు లో, తేది 06.01.2026 న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా, గౌరవ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ గారి అధ్యక్షతన ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ కారణమైందని నిర్ధారించి, ఇందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని వికేరియస్ లయబిలిటీకి లోబరచింది. శస్త్రచికిత్స సమయంలో ఇలేల్ పర్ఫోరేషన్ జరగడం మరియు దానిని సకాలంలో గుర్తించడంలో జరిగిన ఆలస్యం వల్ల సెప్టిక్ పెరిటోనైటిస్ ఏర్పడి కార్డియో–పల్మనరీ అరెస్ట్‌కు దారితీసిందని కమిషన్ స్పష్టం చేస్తూ, ఇది సాధారణ శారీరక ప్రతిచర్య మాత్రమే అన్న వాదనను తిరస్కరించింది. ఇప్పటికే చెల్లించిన రూ.2,00,000/- పరిహారం మృతురాలి వికలాంగ భర్త మరియు ఇద్దరు మైనర్ కుమారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే పూర్తిగా సరిపోదని గమనించిన కమిషన్, అదనంగా రూ. 8,00,000/- పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసింది. అలాగే కుటుంబం గౌరవంగా జీవించేందుకు వీలుగా మృతురాలి భర్తకు తగిన ఉపాధిని కల్పించాలని కూడా ప్రభుత్వానికి సూచించింది.














