EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోఉచిత ఆరోగ్య శిబిరం

ఈతరం భారతం హైదరాబాద్ జులై 19:

ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ (IIMC) కళాశాలలో ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ శిబిరంలో సుమారు 600 మంది విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు మరియు రక్త గ్రూపింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. నిపుణులైన వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య సంబంధిత సూచనలు అందించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి, కంటి సంరక్షణ, నోటి పరిశుభ్రత మరియు రక్త గ్రూప్ తెలుసుకోవడం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎక్సగ్యుటీ డైరెక్టర్ జి.మాధవి మాట్లాడుతూ, యువత ఆరోగ్య పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అని, విద్యార్థుల కోసం ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను భవిష్యత్తులో కూడా వివిధ విద్యాసంస్థల్లో నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ యాజమాన్యానికి, అధ్యాపకులకు, వైద్య బృందానికి, వాలంటీర్లకు మరియు పాల్గొన్న విద్యార్థులందరికీ ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top