EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డ్రైవింగ్ లైసెన్స్: ఇకపై 3 గంటల వీడియో శిక్షణ తప్పనిసరి

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 19:

డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రాష్ట్ర రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలు చూడాలి. ఈ పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. కూకట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని నగరంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాలకు విస్తరించనున్నారు. ఈ శిక్షణ సమయంలో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి.

Related News

Select the Topic
Scroll to Top