ఈతరం భారతం హైదరాబాద్ జూలై 21
తెలంగాణలోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రేపట్నుంచి ఈనెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ నెలలో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఈ టెట్ పరీక్ష రాసేందుకు అర్హులు అని తెలిపారు. పేపర్-1, పేపర్-2లకు వేర్వేరుగా ఫీజులు నిర్ణయించారు. ఈ టెట్ అర్హత భవిష్యత్ డీఎస్సీ నియామకాలకు వర్తించదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించేందుకు ప్రత్యేకంగా ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఉపాధ్యాయుల అర్హతలు, భవిష్యత్ ప్రమోషన్ల కోసం ఈ టెట్ కీలకంగా మారింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 22వ తేదీ నుంచి ఈనెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.















