ఈతరం భారతంహైద్రాబాద్ అక్టోబర్ 6:
______________________________
తెలంగాణ రైతుల సంక్షేమం, అభివృద్ధి మరియు రైతుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండా అప్పారావు నియమితులైనారు.ఈ మేరకు రైతు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా కొండా అప్పారావు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా సంఘానికి మంచి గుర్తింపు తీసుకవాస్తనన్నారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ, రైతుల హక్కుల సాధనలో ముందుండి సంఘాన్ని మరింత బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.















