ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 28; శుక్రవారం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బషీర్బాగ్ నగర శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని నిజాం కళాశాలలో రాఖీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్. శ్రీనివాస్ గారికి, వైస్ ప్రిన్సిపల్ హారతి గారికి, అలాగే ఇతర ఉపాధ్యాయులకు ఏబీవీపీ నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం బషీర్బాగ్ నగర కార్యదర్శి సురేందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్. శ్రీనివాస్ గారు, వైస్ ప్రిన్సిపల్ హారతి గారు, నగర అధ్యక్షులు రాజు గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏబీవీపీ నాయకులు నగర అధ్యక్షులు రాజు గారితో పాటు కళాశాల ఉపాధ్యాయులకు కూడా రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. రక్షాబంధన్ పండుగ భారతీయ సంస్కృతి, సోదరభావం, ఆత్మీయతకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు కళాశాల యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.















