EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పద్మశాలీలు ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళినప్పుడే రాజకీయంగా రాణించగలరు     అఖిలభారత యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాబురావు

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 18

బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లిగూడెం సూరజ్ నగర్ కాలనీకి చెందిన శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం20 26 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిలభారత యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాబురావు ముఖ్యఅతిథిగా విచ్చేసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళినప్పుడే రాజకీయంగా రాణించగలరన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలు పోటీ చేసి తమ సత్తాను చాట వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణా పద్మశాలి సంఘం రాష్ట్ర అద్యక్షులు వలకటి రాజ్ కుమార్ , ఉపాద్యక్షులు వనమాల శంకర్, తెలంగాణా పద్మశాలి మహాసభ రాష్ట్ర కన్వినర్ భారత్ సుదర్శన్ నేత, బొల్లిగూడెం సూరజ్ నగర్ కాలనీకి చెందిన శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం అద్యక్షులు రచ్చ శ్రీనివాస్,గౌరవ సలహాదారులు, డాక్టర్ మహేశుని లక్ష్మయ్య నేత,ప్రదాన కార్యదర్శి ఏలిగేటి దేవందర్,కోశాదికారి రచ్చ వెంకటేష్, తో పాటు బోడుప్పల్ మున్సిపాలిటీ పరిదిలోని వివిధ పద్మశాలి సంగాల అద్యక్ష కార్యదర్శులు ,కార్యవర్గ సబ్యులు పెద్ద ఎత్తున పద్మశాలి లు హాజరైనారు.

Related News

Select the Topic
Scroll to Top