ఈతరం భారతంహైద్రాబాద్ నవంబర్ 25 :
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలకై వేలాదిమంది విద్యార్థులు కలెక్టరేట్ ముట్టదించారు.ఈ సందర్బంగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాయెలాడుతూ ఫీజు రీయింబర్సమెంట్ బకాయిలు రాక 16 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతుంటే ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపక పోవడం పట్ల కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.కోర్సు పూర్తి చేసిన 4లక్షల మంది సర్టిఫికెట్లు లేక విద్యార్ధుల నరకయాతన.వేలాదిమంది విద్యార్ధులు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి.16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపరెందుకు? ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా ప్రాధాన్యత లేని అంశాలపై మాట్లాడి సమయం వృధా చేస్తున్నారు. కోర్సు పూర్తి చేసి 4,00,000 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలలో పెట్టుకున్నారు. బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. 90% మంది ఫీజు రీయింబర్సమెంట్ పథకం పై ఆధారపడి చదువుచున్నారు. ఈ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8000 కోట్లు విడుదల చేయాలని, పాత విధానం ప్రకారం స్కీమును కొనసాగించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్ధులు హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు.
కోర్సు పూర్తి చేసుకున్న వారి సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నవి. వీరు డిగ్రీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులో చదివిన పాస్ అయిన సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు పొందలేక పై చదువులకు వెళ్ళలేక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీముపై ఉన్న వ్యతిరేకత మార్చుకోవాలన్నారు. ఈ స్కీముపై ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీలతో, మేధావులతో చర్చలు జరపాలి అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ మంత్రులతో, శాసనసభ్యులతో చర్చలు జరపాలని కోరారు.
ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పరీక్షా సమయంలో హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఆర్దిక పరిస్థితి లేనివారు సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు లేక అవకాశం కోల్పోతున్నారు. దీనితో ఉన్నత చదువులు ఆపేస్తున్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. విదేశాలకు చదువుకోవడానికి సీట్లు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక వెళ్లలేకపోతున్నారు.
ఫీజుల స్కీము బకాయిలు ఇవ్వకపోవడంపై ఏర్పడిన గందరగోళం వలన విద్యార్ధులకు ఉన్నత చదువులు చదువుతామనే నమ్మకం కోల్పోయింది. 30 వేల మంది విద్యార్ధులు కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదన్నారు.
ఈ ముట్టడి కార్యక్రమంలో బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య,జాతీయ కన్వీనర్, సి.రాజేందర్,నిఖిల్ పటేల్,రాములు గౌడ్, నరేష్ గౌడ్, పృథ్వి గౌడ్, శివ కుమార్ యాదవ్, భీమ రాజు,తదితరులు పాల్గొన్నారు.














