ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 25
నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ఫుట్‌పాత్ ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదచారులకు ఆటంకం కలిగిస్తూ నిర్మించిన ఆక్రమణలను తక్షణమే తొలగించాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉన్నతాధికారులను న్యాయస్థానం నిలదీసింది. కనీసం హైకోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పాదచారులకు సురక్షితమైన మార్గం కల్పించడం ప్రాథమిక హక్కు అని గుర్తు చేస్తూ, తదుపరి విచారణ నాటికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని మున్సిపల్, పోలీసు శాఖల అధికారులను ఆదేశించింది.















