EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బీజేపీలో సంస్థాగత బలానికి నిదర్శనం – గార్లపాటి జితేంద్ర కుమార్ వ్యాఖ్యలు

ఈతరం భారతం  హైదరాబాద్ జనవరి 18

భారతీయ జనతా పార్టీ (BJP)లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు పార్టీ భవిష్యత్ దిశను స్పష్టంగా సూచిస్తున్నాయని నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ అన్నారు. నితిన్ నబిన్ సిన్హా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందన్న వార్తలు, బీజేపీ అట్టడుగు స్థాయి నాయకత్వానికి, అంతర్గత ప్రజాస్వామ్యానికి మరియు సంస్థాగత బలానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

బీహార్‌కు చెందిన నితిన్ నబిన్ సిన్హా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవ చేసిన అనుభవజ్ఞుడని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని జితేంద్ర కుమార్ గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో ఆయన సాగించిన రాజకీయ ప్రస్థానానికి గుర్తింపుగానే ఈ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని అన్నారు.డిసెంబర్ 14న నితిన్ నబిన్ సిన్హాను వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా బీజేపీ ఇప్పటికే ఒక బలమైన, స్పష్టమైన సందేశాన్ని దేశవ్యాప్తంగా ఇచ్చిందని జితేంద్ర కుమార్ తెలిపారు. ఇది వ్యక్తిగత పదవి కంటే, పార్టీ సంస్థాగత పునాదిని మరింత బలోపేతం చేసే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.

నితిన్ నబిన్ సిన్హా వంటి సంస్థాగత అవగాహన కలిగిన నాయకత్వం ముందుకు వస్తే, బీజేపీ మరింత క్రమబద్ధంగా, ప్రజలకు చేరువగా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, కేడర్ ఆధారిత రాజకీయాలను బలోపేతం చేస్తూ దేశ రాజకీయాల్లో తన ప్రత్యేకతను కొనసాగిస్తుందని గార్లపాటి జితేంద్ర కుమార్ అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top