ఈతరం భారతం హైద్రాబాద్ జులై 17 :
బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా చిన్న కేసి ఎల్లయ్య నియమితులయ్యారు ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎల్లయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ హైదరాబాదులోబిసి లు ముక్యంగా విద్యార్థులు యువత బిసి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేస్తూ పెద్ద ఎత్తున పోరాట చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా బీసీ విద్యార్థులకు స్కాలర్ షీప్ లు ఫీజు రియంబర్స్మెంట్ పై ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఆయన పేర్కొన్నారు .అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ తనపై గల నమ్మకంతో తనకు గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం ప్రదానకార్యదర్శిగా నియమించినందుకు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ పరిధిలో బీసీల సమస్యలు విద్యార్థుల సమస్యల పరిహకారం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.















