EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ డైరెక్టర్స్ నియామకాల్లో శ్రీవైష్ణవులకు 50% కేటాయించాలి

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 15:

శ్రీవైష్ణవ సేవ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ప్రారంభ సర్వసభ్య సమావేశం ఎల్ బి నగర్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పీచర కృష్ణమాచార్య, సంఘ సభ్యులు పొడిచేటి రామకృష్ణమాచార్య, ఫణిహారం శ్రీకాంత్ చార్యులు, ఉత్పల అనంతాచార్య, SVS ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ కండ్లకుంట యాదగిరాచార్యులు, శ్రీచిలుకమర్రిలక్ష్మీనాథాచార్యులు, సభ్యులు శ్రీభాష్యం యదుమోహన్, ముడుంబ మాధవాచార్య తదితరులు పాల్గొన్నారు.

సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను స్మార్తులతో భర్తీచేసి, శ్రీవైష్ణవులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కనీసం డైరెక్టర్స్ నియామకాల్లోనైనా శ్రీవైష్ణవులకు 50% కేటాయించి వెంటనే నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీచర కృష్ణమాచార్యమాట్లాడుతూ..ఆర్థికంగా వెనుకబడిన శ్రీవైష్ణవులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్ని జిల్లాల్లో కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 24వ తేదీన సంఘం నిర్వహించనున్న ఉచిత సామూహిక ఉపనయనాలకు 50 మంది వటువులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ అడ్ హక్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా పొడిచేటి రామకృష్ణమాచార్య, కో-కన్వీనర్లుగా ఫణిహారం శ్రీకాంత్ కృష్ణమాచార్య, తాండ్ర్యాల శ్రీనివాస చక్రవర్తి, చిలుకమర్రి కవీంద్రాచార్యులు, శేషభట్టర్ శ్రీకాంతాచార్య, బెల్లంకొండ ప్రవీణ్ కుమార్, తాండ్ర్యాల కృష్ణమోహన్, శ్రీభాష్యం హరికిషన్, కొండపాక కృష్ణమాచార్య, కాండూరి శరత్ వంశీ, మురళీ వెంకటాచార్య, చక్రవర్తుల రవికుమారాచార్య మరియు వీరితోపాటుగా 15 మందిని కార్యవర్గ సభ్యుల ఎంపిక కూడా జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top