ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 21 ; శుక్రవారం
కొండా సురేఖ నియోజకవర్గం దాటితే ఆమెకు ఎవ్వరు ఓట్లు కూడా వేయరు .కేటిఆర్, హరీష్ రావు ఎంకరేజ్ చేస్తేనే కొండా సురేఖ మాట్లాడుతుందనిటీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు.
గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ తల్లి సురేఖ ,తండ్రి మురళి కలిసి సుస్మిత తో మాట్లాడిస్తున్నారు
సుస్మిత నీ బిడ్డ కదా
ఆస్థులన్ని బిడ్డకు ఇవ్వట్లేదా?
Trs లో కొండా సురేఖ, మురళి ఏమి సంపాదించారో మాకు తెలుసు
కాంగ్రెస్ పార్టీ కి కొండా సురేఖ చేసిన శ్రమ ఏంటి? అని ప్రశ్నించారు.
కొండా సురేఖ ఎప్పుడైనా పార్టీ కోసం జైల్ కు పోయిందా?
పక్క జియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేను గెలిపించావా సురేఖ?
సుస్మిత పిల్ల కాదు
ఆమె అనుభవ శాలి
సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు పార్టీ కోసం కష్ట పడ్డడు
పార్టీని బ్రతికించాలని ఆలోచిస్తున్నారు
కష్ట పడ్డ నాయకున్ని విమర్శిస్తారా?
పార్టీ కోసం కష్టపడ్డది పీసీసి అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వీళ్లు అందరూ కష్ట పడితే కొండ సురేఖ పదవి అనుభవిస్తుంది
ఎన్నికల ముందు వరకు కొండా సురేఖ trs లో ఉంది
హై కమాండ్ కు లాయల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు
కార్యకర్తలు శ్రమిస్తేనే కొండా సురేఖ గెలిచింది అనిగుర్తుపెట్టుకోవాలన్నారుగెలిచి పార్టీకి కొండా సురేఖ చేసింది ఏంటిఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే
రేవంత్ రెడ్డి సోనియాగాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాలతో నిద్ర పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు
గడీలను బద్దలు కొట్టిండు రేవంత్ రెడ్డి అని గుర్తించుకోవాలన్నారు.














