ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 22:
________________________________
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీ ఎన్నికల ఎల్బీ నగర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్,రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ నేతలు, డివిజన్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల కార్యాచరణ, నాయకుల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.














