ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 26
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల కోసం ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వనుంది. ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకం కోసం బీసీ మహిళలు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-55 ఏళ్లు ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉండాలి. https://tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం బీసీ అభివృద్ధి అధికారిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది















