EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయకపోతే మూడు పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తాం 

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 19

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయకపోతే మూడు పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లదించారు. నిన్న మేడారంలో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై కనీసం చర్చించలేదని, బీసీ రిజర్వేషన్లపై చర్చించకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్వహించడం బీసీలను మరోసారి దగా చేయడ మేనని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు . ఆందోళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి మారకపోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పై ఎందుకు చర్చించలేదు చట్టపరంగా ఇవ్వలేనప్పుడు పార్టీ పరంగానైనా ఇస్తామని ఎందుకు ప్రకటించడం లేదు మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతాం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు జరపాలని బిజెపి, బిఆర్ ఎస్ పార్టీలు ఎందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఇక ఎన్నికలైనా నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్పష్టంగా హామీ ఇచ్చి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని నిర్ణయించడం అంటే బీసీలను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిందని ఆయన మండిపడ్డారు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు, ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించడం చాలా సిగ్గుచేటు అన్నారు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతిచ్చిన అఖిలపక్ష పార్టీలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా సడిచప్పుడు చేయకుండా మౌనం పాటిస్తున్నాయని, ఈ పార్టీలకు బీసీల పైన కపట ప్రేమ ఉందని మున్సిపల్ ఎన్నికల విషయంలో తేలిపోయింది అన్నారు . మెస్సి ఆట కోసం హైదరాబాదుకు వచ్చిన రాహుల్ గాంధీ బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న హైదరాబాద్ కు వచ్చి ఎందుకు స్పందించడం లేదన్నారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు బుట్ట దాఖలు చేస్తుంటే రాహుల్ గాంధీ కళ్ళుమూసు కుంటున్నాడా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కై బీసీలకు ద్రోహం తలపెడుతున్నాయని బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి స్థానిక ఎన్నికలు జరగడానికి ఈ రెండు పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లే కారణమని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు చట్టపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం ఇవ్వలేకపోతే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి పార్టీ గుర్తులతో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీపరంగా జనాభా దామాషా ప్రకారం 56% టికెట్లు ఇస్తామని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు,లేదంటే కాంగ్రెస్ ను బీసీలు ఇక జన్మలో నమ్మరని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక ముగిసిన అధ్యయంగా మిగిలిపోతుందని ఆయన హెచ్చరించారు బీసీ రిజర్వేషన్ల 42 శాతం సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రెండు రోజుల్లోనే జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు ఉద్యమ కార్యక్రమం ప్రకటించి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, అధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జేఏసీ కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్,బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ దీటి మల్లయ్య, జజుల లింగం గౌడ్, బుదాని సదానందం,మాదేశి రాజేందర్, తారాకేశ్వరి, జిల్లెల నరసింహ, గూడూరు భాస్కర్, సంధ్యారాణి, సిద్ధాంతం శ్యామల, శైలజా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, విజయలక్ష్మి, రాజేశ్వరి,వెంకటేష్, శ్రీనివాసాచారి, గజ్జల సత్యం గౌడ్, జే. వెంకటయ్య,జే. వెంకటమ్మ, నర్సమ్మ, అంజమ్మ, బీవీ, అలవేల, తదితరులు పాల్గొన్నారు ..

Related News

Select the Topic
Scroll to Top