ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 13
నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు కాచిగూడ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలిసుల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటినుండి బయటికి వెళ్ళినవారు క్షేమంగా తిరిగి రావాలిఅనే (అరివ్..అలైవ్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, , పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాచిగుడా ట్రాఫిక్ సి ఐ కౌశిక్ మాట్లాడుతూ ప్రతి ఒక వాహనదారుడు ఉదయం ఇంటి నుండి బయలు దేరి తిరిగి వచ్చే వరకు ఇంట్లో వాలంతా ఎదురు చూస్తారు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు. ఒక వేళ ఆలా చేస్తే కేసులు నమోదు అవుతాయి మరి జైలు కు వెళ్ళాలన్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ యువత చెడు దారిన వెళ్లకుండా ఉండాలని, హెల్మెట్ తప్పక వాడా లని అన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్ అధికారులు వీరమళ్ళు ,ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీకాంత్, లా అండ్ ఆర్డర్ ఎస్.ఐ శ్రీకాంత్, స్థానిక బస్తినాయకుడు సొల్మన్ తదితరులు పాల్గొన్నారు.















