EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విజయవంతంగా  ఫిట్‌ఫార్ములా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ – ఎడిషన్ 2

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 10 : (మహేశుని లక్ష్మయ్య హైదరాబాద్ ప్రతినిధి)

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో ఫిట్‌ఫార్ములా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ – ఎడిషన్ 2 ను జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 250 మంది ఈతగాళ్లు పాల్గొని క్రీడాస్ఫూర్తి, ఫిట్‌నెస్, సమానత్వం మరియు పోటీతత్వాన్ని చాటిచెప్పారు.ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్ నగరంలో తొలిసారిగా మేధో వికలాంగత మరియు ఆటిజం ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. ఇందులో సుమారు 50 మంది ప్రత్యేక కేటగిరీ ఈతగాళ్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.

స్విమ్మింగ్ క్రీడాభివృద్ధి, ఫిట్‌నెస్ ప్రోత్సాహం మరియు ప్రతి చిన్నారికి సమాన క్రీడా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో  వినోద్ పాస్వాన్ స్థాపించిన ఫిట్‌ఫార్ములా సంస్థ ఆధ్వర్యంలో, సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మేఘా తార్సే నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె. శివసేన రెడ్డి గారికి వారి అమూల్యమైన సహకారం, ప్రోత్సాహానికి ఫిట్‌ఫార్ములా సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి యువ క్రీడాకారులను ప్రోత్సహించిన  వాకిటి శ్రీహరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, స్విమ్మింగ్ కోచ్  ఆయుష్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిబ్బంది, సాంకేతిక అధికారులు, రిఫరీలు, వాలంటీర్లు, కోచ్‌లు, లైఫ్‌గార్డులు మరియు ఫిట్‌ఫార్ములా సిబ్బంది అందరికీ వారి కృషి, అంకితభావానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.

ఉత్తమ ప్రతిభా పురస్కార విజేతలు

అండర్-8 బాలురు: హయంత్ – 4 బంగారు పతకాలు

అండర్-8 బాలికలు: పౌష్ణ – 2 బంగారు పతకాలు

అండర్-10 బాలికలు: ఆర్ణ – 4 బంగారు పతకాలు

అండర్-12 బాలికలు: మానస్విని – 2 బంగారు పతకాలు

అండర్-12 బాలురు: రుధ్వి – 2 బంగారు పతకాలు

అండర్-14 బాలురు: ప్రదిత్ – 4 బంగారు పతకాలు

అండర్-14 బాలికలు: పాలిని – 4 బంగారు పతకాలు

అండర్-16 బాలికలు: అద్విక – 2 బంగారు పతకాలు

అండర్-18 బాలికలు: సాత్విక – 4 బంగారు పతకాలు

18 ఏళ్లు పైబడిన బాలురు: జైజీత్ – 2 బంగారు పతకాలు

ఈ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడిన స్పాన్సర్లకు ఫిట్‌ఫార్ములా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

స్పాన్సర్లు:

హేమాంగి హాస్పిటల్ – టైటిల్ స్పాన్సర్

న్యూ హోప్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ – అసోసియేట్ స్పాన్సర్

పోటీల ముగింపు సందర్భంగా ఘనంగా పతకాల ప్రదానోత్సవం నిర్వహించి విజేతలను సత్కరించారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన క్రీడాకారులు, విజేతలు, తల్లిదండ్రులు, కోచ్‌లు, అధికారులు, వాలంటీర్లు మరియు మద్దతుదారులందరికీ ఫిట్‌ఫార్ములా అభినందనలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలోఫిట్‌ఫార్ములా వ్యవస్థాపకులు,వినోద్ పాస్వాన్  సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మేఘా తార్సే,

డైరెక్టర్: శ్రీ సంజయ్ సోనార్ ఫిట్‌ఫార్ములా సభ్యులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top