EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీకృష్ణ మందిరం నూతన భవన నమూనాను ఆవిష్కరించిన డా.కె.వి.రమణాచారి

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 11: శుక్రవారం

_________________________________________

కృష్ణాష్టమి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ మందిరం ట్రస్ట్ నూతన భవన నమూనాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి ఆవిష్కరించారు. అలాగే దేవాలయానికి సంబంధించిన చిత్రాల వివరాలను తెలియజేసే బ్రోచర్ ను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల ద్వారానే మనసుకు ప్రశాంతత సమాజానికి సమైక్యత చేకూర్తాయని అన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు త్రిమూర్తుల గౌరీ శంకర్ దంపతులు నిర్వహించిన నిత్య పూజ కార్యక్రమాలతో అక్కడ ఆధ్యాత్మిక శోభను సంతరింపజేశాయి. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ శ్రీకృష్ణతత్వం వెళ్లివిరిసింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి కృష్ణకుమారి, ఏ విద్యాలక్ష్మి, లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ, కేఎస్ కిరణ్ కుమార్, రవి చారి, టీవీ స్వామి, రఘు శ్రీ ,సాధన నరసింహచార్య తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జయ వెంకటేష్ బృందం, పీవీ సుందరవల్లి శ్రీదేవి బృందం, వేణుమాధవ్ రెడ్డి ప్రణీత రెడ్డి బృందం, సూర్యకుమార్ బృందం భక్తి సంగీత కార్యక్రమ ప్రసంగాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top