EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ 

ఈ తరం భారతం హైదరాబాద్ నవంబర్ 19:

__________________________________

ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ హైదరాబాదులో  కంప్యూటర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ శివం రోడ్డు లో ఉన్న ఈ సాయిబాబా సంస్థాన్ లో ప్రతిరోజు సాయంత్రం పూట శిక్షణ తరగతులు ఉంటాయి. ఐదు గంటల నుండి 8:30 వరకు ఈ తరగతులను నిర్వహిస్తారు. యువతీ యువకులకు, పిల్లలకు, స్త్రీలకు పురుషులకు ఇందులో ప్రవేశాలు లభిస్తాయి. ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ప్రాక్టికల్ ట్రైనింగ్, జాబ్ అసిస్టెన్స్ సేవలు లభిస్తాయి. శిక్షణలో భాగంగా టైపింగ్ కంప్యూటర్ బేసిక్స్ ఎమ్మెస్ ఆఫీస్ ఇంటర్నెట్ ఇమెయిల్ లాంటి అంశాలు బోధిస్తారు. డిజిటల్ స్కిల్స్ అందించే ఈ సంస్థ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కొత్త బ్యాచ్ త్వరలో మొదలు కానుంది. ఇందులో చేరాలని అనుకునేవారు 8374334546,9849828370 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఆసక్తి కలవారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.

Related News

Select the Topic
Scroll to Top