EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

షర్టు చిరిగిన సర్ పై పోరాటం ఆగదు

ఈతరం భారతం హైదరాబాద్అక్టోబర్ 9:

______________________________

ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని బేగంబజార్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బి అభిషేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు సవరణలో అవకతవకలపై సి ఈ సి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో అవకతవకలను నిరసిస్తూ చేపట్టిన చలో లోక్‌భవన్‌ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అరవింద్ కుమార్ యాదవ్ నేతృతంలో అభిషేక్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్‌ వరకు నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిషేక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న అత్యంత కీలకమైన హక్కు అని, ఆ హక్కును కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సమగ్రంగా స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఓటర్ల జాబితాలో పారదర్శకత ఉండాలి

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని అభిషేక్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన విధానాన్ని పాటించాలని కోరారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హమైన తొలగింపులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ తరఫున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

నిరసనకారుల అరెస్టును ఖండిస్తున్నాం

లోక్‌భవన్‌ వద్ద నిరసన చేపట్టిన తమను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషనులకు తరలించారని అభిషేక్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం పరిష్కారం కాదని, అరెస్టులతో ప్రజల గొంతును అణచలేరని ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top