EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సర్కారు బడి పిల్లలకు.. లైట్ బ్లూ షర్ట్, నేవీ బ్లూ ప్యాంట్

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 13

రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల యూనిఫాం రంగులు, డిజైన్ ను మారుస్తూ విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రంగులకు బదులుగా, మరింత ఆకర్షణీయం గా ఉండేలా కొత్త కలర్ కాంబినేషన్ ను ఖరారు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్  అధికారిక ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ బడి పిల్లలు సరికొత్త ‘లుక్’లో మెరవనున్నారు. కొత్త కలర్ కాంబినేషన్ ప్రకారం.. బాలుర షర్టులు, బాలికల టాప్స్ లైట్ బ్లూ (లేత నీలం) రంగులో ఉంటాయి. అలాగే బాలుర ప్యాంట్లు, బాలికల బాటమ్స్ (చూడీదార్/స్కర్ట్)తో పాటు బాలికల వెయిస్ట్ కోట్ నేవీ బ్లూ (ముదురు నీలం) రంగులో ఉండనున్నాయి.కొత్త యూనిఫాం డిజైన్, రంగులకు అనుగుణంగా దుస్తుల తయారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.

Related News

Select the Topic
Scroll to Top