ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 13 :
గడిచిన 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ప్రభా గౌడ్ అన్నారుభాగ్యనగర్ జిల్లా – మలక్‌పేట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ మరియు భారతదేశ ప్రగతికి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి మీడియా సమావేశం లో వివరించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజాహిత కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వెల్లడించారు.గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ మాటలకు ప్రాధాన్యత ఉండేది కాదు.. నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి.12 ఏళ్ల ప్రధాని మోదీ పాలన చారిత్రాత్మకం – 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనే లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలచే ఎన్నికై, అత్యంత సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారని, ఇది సామాన్యమైన విజయం కాదని, ప్రజల అచంచల విశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారని పేర్కొంటూ, మోదీ నేతృత్వంలోని గడిచిన 12 సంవత్సరాల కాలం దేశ ప్రగతిలో, సంస్కరణల పరంగా చారిత్రాత్మకమైనవని, 2047 నాటికి భారతదేశం ఖచ్చితంగా ‘వికసిత భారత్’గా మారి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ మరియు భారతదేశ ప్రగతికి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజాహిత కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వెల్లడించారు.
ఒక నమ్మకమైన నాయకుడికి ఉండాల్సిన నాలుగు గుణాలు—పారదర్శకత (ఇంటిగ్రిటీ), నిజాయితీ, పని చేసే సామర్థ్యం, ఇచ్చిన హామీలను ఫలితాలుగా మార్చే నైపుణ్యం—ప్రధాని మోదీ లో సంపూర్ణంగా ఉన్నాయని స్పష్టం చేశారు. బీజేపీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా, రాబోయే తరం (నెక్స్ట్ జనరేషన్) భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని అన్నారు.
ముస్లిం మహిళల జీవితాల్లో శాపంగా మారిన తీన్ తలాక్ సామాజిక దురాచారాన్ని చట్టబద్ధంగా రద్దు చేశామని, వక్ఫ్ చట్టాల్లో అవసరమైన సంస్కరణలను విజయవంతంగా తీసుకువచ్చామని డాక్టర్ ప్రభ గౌడ్ చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లును తీసుకువచ్చామని, మహిళలకు పూర్తి భాగస్వామ్యం, హక్కులు దక్కే వరకు తాము విశ్రమించబోమని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని స్పష్టం చేశారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం ప్రపంచానికి ఒక ఆపద్బాంధవుడిగా, విశ్వబంధువుగా నిలిచిందని అన్నారు. ‘వసుధైక కుటుంబకం’ అనే సందేశాన్ని కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిన దేశం భారతదేశం అని, కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్లలో 60% మనదేశంలోనేతయారయ్యాయని, ‘వ్యాక్సిన్ మైత్రి’ ద్వారా 100కు పైగా దేశాలకు 30 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేశామని చెప్పారు.
గత ప్రభుత్వాల హయాంలో ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారారని, కానీ తమ అంత్యోదయ విధానం వల్ల గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది దేశ ప్రజలను పేదరిక రేఖకు ఎగువకు తీసుకువచ్చామని, అంతర్జాతీయ సంస్థల నివేదికలే దీనిని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. సమానత్వం (ఈక్వాలిటీ) విషయంలో ప్రపంచంలో భారత్ నేడు నాల్గవ స్థానానికి చేరిందని, రాబోయే 5 నుండి 8 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని నొక్కి చెప్పారు. గతంలో బ్యాంకు ఖాతా తెరవాలంటె సిఫార్సులు, సాక్ష్యాలు కావాల్సి వచ్చేదని, మోదీ గారు వచ్చాక 56 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు తెరిపించారని, ఇప్పుడు బ్యాంకే ప్రజల ఇంటి వద్దకు వస్తోందని అన్నారు. దీనివల్ల ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఢిల్లీ నుండి పంపిన సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరుతోందన్నారు. గ్రామీణ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ దేశంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించామని, 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు కేవలం 17% ఇళ్లకు మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుతుండగా, ఈరోజు ఆ సంఖ్య 82%కి చేరిందని, కోట్లాది మంది మహిళలకు నీటి కోసం మైళ్ల దూరం నడిచే కష్టం తప్పిందని పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా కోట్లాది ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేశామని, ఉజ్వల యోజన ద్వారా పొగ నుండి విముక్తి కల్పించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు. రాజులమని భావించే కాంగ్రెస్ నాయకులకు పేదరికం, గ్రామీణ బాధలు ఎప్పటికీ అర్థం కావని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మరియు పార్టీ నాయకులుగా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ , పార్టీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి , సురేందర్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేందర్ యాదవ్ , కార్యక్రమ సమన్వయకర్త నరసింహ పాల్గొన్నారు.















