EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

2026 కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌ బిల్లు ప్రతిపాదిత ముసాయిదాను పరిశీలించండి.

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 28 ; శుక్రవారం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ మహానగర పాలనను ఆధునీకరించేందుకు 1955 నాటి జీ.హెచ్‌.ఎం.సీ చట్టం స్థానంలో 2026 కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌ బిల్లు ప్రతిపాదిత ముసాయిదాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు సెప్టెంబర్ రెండవ వారంలో జరగనున్న శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టనున్న దరిమిలా ది సిటీజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సీతారం దూళిపాల, అందె లక్ష్మణ్ రావు, ఆరీఫ్ మహమ్మద్, బొడ్డు శ్రీధర్, ఆకుల నరేష్ తది తరులందరు గౌరవ శాసనసభ్యు లందరికీ బహిరంగ లేఖ రాశారు. ప్రజా హితవుకోరి శాసనసభ్యులు బిల్లును సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

పాత చట్టం ప్రకారం పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనా, పౌర సమస్యలకు అనుగుణంగా సమగ్రంగా పునర్వ్యవస్థీ కరించాల్సిన డానికి బదులు రాజ్యాంగబద్ధ వికేంద్రీకరణ, ఎన్నికైన స్థానిక సంస్థల స్వయం ప్రతి పత్తి, ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయకుండా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన పట్టణ స్థానిక సంస్థల హక్కులను హరీస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతిపాదిత అపేక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థలపై అధికారం కేంద్రీకరించే విధంగా, ఎన్నికైన కార్పొరేషన్ల స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడువడానికి సన్నద్ధం అవుతున్నారు కావున ప్రజల భాగస్వామ్య పద్దతి ప్రకారం ప్రతి వార్డులో రెండు సంవత్సరాల పదవీకాలంతో సమర్థవంతమైన వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తూ అందులో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, సివిల్ సొసైటీ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, తీర్మానాలను కార్పొరేషన్/స్టాండింగ్ కమిటీ పరిశీలించే మరియు వాటిపై చర్య తీసుకునే విధానం ఉండాలని సూచించారు.

రోజువారీ పౌర సమస్యల పరిష్కారానికి కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు తగిన ఆర్థిక, పరిపాలనా అధికారాలను అప్పగించాలని, ప్రభుత్వ విలువలు, వాస్తవ మార్కెట్ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిష్కరించ కుండా క్యాపిటల్ వ్యాల్యు ఆధారిత పన్ను విధానం అమలు చేయడం ద్వారా నిజాయితీగా పన్ను చెల్లించే ప్రజలపై భారం పెరుగుతుంది కావున వార్షిక అద్దె విలువ విధానాన్ని కొనసాగించడం లేదా పారదర్శకమైన, న్యాయమైన ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలని కోరారు.

రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కార్పొరేషన్ స్థానిక సంస్థ చట్టబద్ధమైన వ్యవహారాలను తానే నిర్వహించుకునే స్వయం ప్రతిపత్తి కలిగి, చట్ట పరిధిలో ఆమోదించిన తీర్మానాలను గౌరవించి అమలు చేయాలని, పదవీ దుర్వినియోగం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలు లేదా చట్ట ఉల్లంఘన వంటి అసాధారణ పరిస్థితులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా కార్పొరేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కొరడ మైనది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కార్పొరేటర్లకు తగిన ప్రోటోకాల్, సంస్థాగత పాత్ర, అధికారిక గుర్తింపు చట్టంలో స్పష్టంగా ఉండాలని కొరడ మైనది, మరియు ఎన్నికైన కార్పొరేషన్‌ను సస్పెండ్ లేదా సూపర్‌సీడ్ చేసే అధికారం ఏకపక్షంగా వినియోగించ కుండా స్పష్టమైన చట్టపరమైన విధానం, రక్షణలు మరియు జవాబుదారీతనం ఉండాలని కోరారు.

తదనంతరం ప్రతిపాదిత అప్పీలేట్ అథారిటీకి తగిన ట్రిబ్యునల్ స్థాయి న్యాయ పరమైన అధికారాలు మరియు స్వతంత్రత కల్పించి, మున్సిపల్ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేలా చేయాలి. అదే సమయంలో ప్రస్తుత బహుళ అంతస్తుల ట్రిబ్యునల్ తో అధికార పరిధి స్పష్టంగా నిర్వచించాలని గౌరవ శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top