EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి ప్రయత్నం సమాజ పురోగతికి దోహదం చేస్తుంది వ్యవసాయ శాఖ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన విశ్వవిద్యాలయంలో అక్షయ డైనింగ్ హాల్ ప్రారంభం

ఈతరం భారతం ములుగు  ఆగస్ట్ 19 :ములుగు లో విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశోధన ప్రారంభించినప్పుడే పలు విషయాలు బోధపడతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ములుగు మండలంలోని ములుగు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యం కోసం అక్షయ డైనింగ్ హాల్‌ను తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కొండా లక్ష్మణ్, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డీ,రాజిరెడ్డి, లతో కలిసి ఆయన ప్రారంభించారు. అందుకు ముందు యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో పరిశోధనలు ప్రారంభించినప్పుడే ఉన్నత జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని అన్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగాలే వస్తాయని ఆశ కాకుండా తమ నేర్చుకున్న పరిశోధనలపై ప్రత్యేక శ్రద్ధ చూపినప్పుడు వారే పట్టుదలతో ఎదుగుతారన్నారు. విద్యార్థులు కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అందులో భాగంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో నూతన వరవడిని తో పరిశోధనలు చేసి, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఈ సౌకర్యం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ రంగంలో నాణ్యమైన పరిశోధనలు చేయడానికి ఇది ప్రేరణనిస్తుందని తెలిపారు. విద్యార్థులు కూడా ఈ ఏర్పాటుకు వ్యాసారంగా పలు విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇక్కడి పరిశోధనల ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు అన్నారు. విద్యార్థులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు, పరిశోధనలు చేయడానికి ఇది ప్రోత్సాహకంగా మారుతుందన్నారు. విద్యార్థులు బాధ్యతగా భావించి వారి విధులు నిర్వర్తించడంలో నిజాయితీగా ఉండాలని కోరారు ఎందుకంటే ప్రతి చిన్న ప్రయత్నం సమాజం మరియు దేశం యొక్క పురోగతికి దోహదపడుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులను వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం గ్రామాల్లోని రైతుల వద్దకు తీసుకెళ్లి పలు సూచనలు తీసుకుంటే వ్యవసాయ రంగంపై పట్టు సాధించవచ్చు అని వారు తెలిపారు వ్యవసాయ శాఖ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Related News

Select the Topic
Scroll to Top