EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సాఫ్ట్ వేర్ కన్నా హార్టికల్చర్ లోనే ఎక్కువ అవకాశాలు : మంత్రి తుమ్మల

ఈ తరం భారతం ములుగు ఆగస్టు 19 :భారతదేశంలో అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.భవిష్యత్తు అంతా వ్యవసాయానిదేనని గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదు. రైతు శ్రమ ఆగలేదు అన్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగిందని తెలిపారు. మంగళవారం ములుగు జిల్లాలోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హార్టికల్చర్ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉటుందని, విద్యార్థులుగా ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.విద్యార్థులు మొత్తం కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పోలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని, రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలని తెలిపారు. హార్టికల్చర్ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాలలో ఉన్న పామాయిల్ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరిస్తే డిమాండ్ ను అధిగమించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరుగుతుందని, ఆయిల్ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోఉందని, రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామాయిల్ పంటను 10 లక్షల ఎకరాలకు రాష్ట్రంలో విస్తరించడానికి ప్రణాళిక చేయడం జరిగిందన్నారు.

కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి అన్ని పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు అంతా హార్టికల్చర్ దే అని తాను భావిస్తున్నానని, రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యాన పంటలు ఒక గ్రోత్ ఇంజన్ గా నిలుస్తున్నాయన్నారు. హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలని సూచించారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఙానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top