గద్వాల ఫిబ్రవరి 19 ఈతరం భారతం:
గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు సమాచారం. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.














