EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పుకార్లను నమోద్దు : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

ఈతరం భారతం గద్వాల సెప్టెంబర్ 9 :

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు గద్వాల‌ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్. గద్వాల మండలం లత్తిపురంలో గ్రామ శివారులో ఒక దయ్యం ఓ వ్యక్తికి కనబడిందని, ఆ వ్యక్తి దాని ఫోటో తీయగానే దయ్యానికి కోపం వచ్చి అతని మీద దాడి చేసిందని ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లత్తిపురం గ్రామంలో దయ్యం సంచరిస్తుందని, సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలను ఆకతాయిలు వైరల్ చేస్తున్నారని, అవి పూర్తిగా అబద్ధం ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని గద్వాల్ రూరల్ పోలీసులు సూచించారు. ఆకతాయిలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు‌.

Related News

Select the Topic
Scroll to Top