EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డా. బట్టు వెంకన్నకు రాష్ట్రస్థాయి ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు

ఈతరం భారతం ఖమ్మం: ఆగస్టు 28 గురువారం

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న రాష్ట్రస్థాయి ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ చేతుల మీదుగా ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ & బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. బట్టు వెంకన్న ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోనున్నారు.క్రీడా రంగంలో విశిష్ట సేవలు, ప్రతిభకు గుర్తింపుగా డా. బట్టు వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ జాకిర్ఉల్లా అధ్యాపకులు,విద్యార్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేసారు.

Related News

Select the Topic
Scroll to Top