ఈతరం భారతం ఖమ్మం: సెప్టెంబర్ 28
________________________________
మాయాబజార్ 2027 మ్యాజిక్ ఫెస్టివల్‌లో నిర్వహించిన సీనియర్ మెజీషియన్స్ కాంపిటీషన్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ మెజీషియన్ శ్రీ మాయా మస్తాన్ మూడవ బహుమతి సాధించారు.గత 15 సంవత్సరాలుగా మ్యాజిక్ రంగంలో కొనసాగుతూ, తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ వస్తున్న మాయా మస్తాన్ ఈ పోటీలో విశేష ప్రతిభ కనబరిచారు. సుమారు 200 మంది మెజీషియన్స్ పాల్గొన్న మ్యాజిక్ ఫెస్టివల్‌లో మూడవ బహుమతి సాధించడం ద్వారా ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఆర్డీవో గారి చేతుల మీదుగా మాయా మస్తాన్ మూడవ బహుమతిని అందుకున్నారు.15 ఏళ్లుగా మ్యాజిక్ కళకు అంకితభావంతో సేవలందిస్తూ, పోటీలో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించిన మాయా మస్తాన్‌ను పలువురు అభినందించారు.















