EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దక్షిణ తెలంగాణ కు కేంద్ర బిందువు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ రిఫరల్ ఆసుపత్రిగా అభివృద్ధి : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా

ఈతరం భారతం  మహబూబ్ నగర్ ఏప్రిల్ 10 :

మహబూబ్‌నగర్‌లో మెడికల్ సేవలు, విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వ దృష్టి సారించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల లోభాగంగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న స్వచ్చంద మెగా రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయుష్, హోమియోపతి, యునాని వైద్య శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు.

అనంతరం మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను, మెడికల్ కాలేజీలో,నర్సింగ్ కాలేజీ లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కావలసిన మౌలిక సౌకర్యాల కల్పన,సమస్యలు గురించి వారి నుండి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాను దక్షిణ తెలంగాణ వైద్య రంగానికి కేంద్రంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో రిఫరల్ ఆసుపత్రి గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మెడికల్ కాలేజ్‌లో సీట్ల పెంపు, పీజీ కోర్సుల విస్తరణ, విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలు, ఆడిటోరియం నిర్మాణం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొత్త టీచింగ్ హాస్పిటల్ భవనం పనులు త్వరలో పూర్తిచేసి, జూన్ నెలలో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, టీచింగ్ హాస్పిటల్ ప్రారంభంతో పాటు హాస్టల్స్ భవనం మరియు ఆడిటోరియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రికి అవసరమైన అదనపు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పూర్తిగా సమకూర్చుతుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ను సూపర్ స్పెషాలిటీ మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రిఫరల్ సెంటర్‌గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పార.ఇందులో భాగంగా ఎంఆర్ఐ వంటి ఆధునిక వైద్య సదుపాయవైద్థియేటరaగా అందుబాటులోకి తీసుకురావడం,సర్జరీలకు *రోబోటిక్స్ వైద్థియేట*, *అత్యాధునిక ఆపరేషన్ థియేటర్* ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ రిట్రీవల్ సెంటర్, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్ వంటి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. అలాగే, మెడికల్ కాలేజ్‌లో ప్రస్తుతం ఉన్న 21 విభాగాలకు అదనంగా మరో 14 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేసి, హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ముఖ్యంగా సర్జికల్ విభాగాలను బలోపేతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను తీర్చేందుకు భారీగా నియామకాలు చేపడుతున్నామని, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చేపట్టినట్లు ఇప్పటికే 172 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. ప్రొఫెసర్ ఖాళీలను ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.

2232 నర్స్ లను రాష్ట్రం లో కొత్తగా నియామకం చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే జిల్లాలో ఉన్న 100 నుండి 150 పడకల సెకండరీ ఆసుపత్రులను కూడా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. ప్రతి 30 నుండి 35 కిలోమీటర్ల పరిధిలో థర్డ్ లెవెల్ ట్రామా కేర్ సెంటర్లను, ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, విద్యార్థులకు మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. తర్వాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు,చికిత్స గురించి తెలుసుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top