EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో 252 ను సవరించాలి..

ఈతరం భారతం మేడ్చల్ జిల్లా డిసెంబర్ 27

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందం బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీయూడబ్ల్యూజే (TUWJ-H-143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేడ్చల్ జిల్లా జర్నలిస్టులతో కలిసి ఆందోళన ధర్నా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలోని, కుత్బుల్లాపూర్ కూకట్పల్లి,మల్కాజ్గిరి మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అక్రిడిటెషన్ కార్డులకోత విధించే జీవోలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ 252 జీవో తీసుకురావడం శోచనీయమన్నారు. లోప భూయిష్టమైన ఈ జీవో వల్ల మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ కేంద్రాల్లో, లక్ష జనాభా దాటిన పట్టణాల్లో అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. కొత్త జీవో వల్ల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అనేకమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటెషన్ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని, జీవో 252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదనీ , దీని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.పాత జీవో 239 యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్ కు సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు కోరారు.ధర్నా అనంతరం జర్నలిస్టు సమస్యలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు

 

 

Related News

Select the Topic
Scroll to Top