మేడ్చల్ ఆగస్ట్31(ఈతరం భారతం)దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ పటేల్ , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి గణనాధుని నవరాత్రి వేడుకలలో భాగంగా వివిధ కాలనీలు, అయోధ్య నగర్, బండ్లగూడ లోని మోడీ అపార్ట్మెంట్, బండ్లగూడ ఠాగూర్ కాలనీ, శశాంక్ ఎంక్లేవ్, బాలాజీ నగర్ కాలనీ, సాయి తిరుమల ఎంక్లేవ్, సాయి బృందావన కాలనీ, సాయి చంద్ర కాలనీ, నందన ఎంక్లేవ్ గల కాలనీలలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వివిధ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు గణేష్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న బుద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ..వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో మతసామారస్యం దైవభక్తి సమిష్టి తత్వం మరింతగా బలపడాలని సత్కార్యాలన్ని ఎటువంటి విఘ్నూలు లేకుండా ప్రతీ ఒక్కరి కుటుంబంలోని వారందరికి విజయం కలగాలని గణనాధుని కృపాకటాక్షాలు ప్రతీ ఒక్కరిపైన ఉండాలని మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నూలు కలగకుండా ఆ గణపయ్య మిమ్మల్ని అనుగ్రహించాలని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖశాంతులు వెళ్లి విరిసేలా దీవించాలని ఆ విఘ్నేశ్వరుడిని మనసారా ప్రార్థిస్తున్నాను అని అన్నారు,తదుపరి కాలనీవాసులు శ్రీ బుద్ది శ్రీనివాస్ ను ఘనంగా శాలువాతో సత్కరించ్చిన తధనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి నాయకులు, దమ్మాయిగూడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ బిజెపి నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీలవాసులు, మహిళా మణులు, తదితరులు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు














