ఈతరం భారతం మెదక్ మే 29 :
శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో మెదక్ లోని బోరంచమ్మ, సరస్వతి మాత దేవాలయ ప్రాంగణము లో శ్రీ పార్శం రత్న , మంజుల స్నేహ బృందం పర్యవేక్షణలో కోటి పార్థివలింగార్చన మహోత్సవము అత్యంత వైభవముగా జరిగినది . ముందుగా దీపారాధన, కలశస్థాపన ,గణపతి ,గౌరీపూజ ,నవగ్రహ ఆరాధన ,మరియు భక్తులు పుట్టమన్ను చేత 108 పార్థివ లింగములు చేసి ఆ శివలింగాలకు పంచామృత అభిషేకము రుద్రాభిషేకము, భస్మార్చన ,పుష్పార్చన ,బిల్వార్చన, ధూప, దీప ,నైవేద్యములతో పూజ చేసిరి. శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి మరియు బాసర శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధా శ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీ నిర్మల అంబికానాథ శర్మ పూజాది కార్యక్రమములు చేయించి మాట్లాడుతూ బాసర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల దేవాలయం ఈశాన్య భాగమున కోటి పార్థివలింగ స్తూపము నిర్మించినామని అందులో కోటి (పార్థివ)శివలింగములను స్థాపన చేయ దలచినామని , కోటిలో సుమారు 90 లక్షల శివలింగాలను భక్తులతో చేయించడం, స్థాపన చేయడము జరిగినదని ,ఇంకా 10 లక్షలు లింగాలు చేయవలసి ఉన్నవని మరియు ఆసక్తి గల మహిళా బృందం వారు 9948332032 సంప్రదించి వారి వివరాలు తెలిపినచో పుట్టమన్ను ఉచితముగా ఇచ్చి మీతో శివలింగాలు మరియు పూజ కార్యక్రమాలు చేయించి అట్టి లింగములను కోటి పార్థివలింగ స్తూపం యందు నిక్షిప్తం చేయబడును అని శర్మతెలిపినారు.. ఈ కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మీ సౌభాగ్యవతి పార్శం రత్న మాట్లాడుతూ అధిక మాసంలో ఏకాదశి తిథి రోజు శివార్చన పార్థివలింగార్చన చేయడం , చేయించడం మిక్కిలి ఆనందం కలగజేసిందని అన్నారు. బాసర సరస్వతీ స్తూప పార్థివ లింగస్తుప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మ ను నిర్వాహకులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. దేవాలయ పరిసర కాలిని వాసులు మరియు దేవాలయ ఆలయ ప్రధాన అర్చకులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్కొన్నారు. ఈ ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా అన్నదానము కార్యక్రమం నిర్వహించారు.














