EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మేడారం భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు

ఈతరం భారతం ములుగు జనవరి 16

మేడారం సమ్మక్క-సారలమ్మ భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా, వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తుల ఇంటి వద్దకే బంగారం ప్రసాదాన్ని చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ సహకారంతో, బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయబడతాయి. దీనికి గానూ భక్తులు రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది. www.tgsrtclogistics.co.in లో లేదా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు.

Related News

Select the Topic
Scroll to Top