ఈతరం భారతం నాగర్ కర్నూల్ ఏప్రిల్ 24
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దిశా సమావేశానికి హాజరు అయ్యేందుకు వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలకు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని గత 15 రోజులుగా ధాన్యాన్ని తరలించిన కొనుగోలు చేయడం దానిని తరలించకపోకపోవడంతో పడి కాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంలోనే అటుగా వెళుతున్న ఎమ్మెల్యేల కాన్వాయ్ ను రైతులు అడ్డుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి తో పాటు పలువురు నాయకులు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని వివరించిన రైతులు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తన వ్యక్తం చేస్తామని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులతో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడి వెంటనే ధాన్యాన్ని తరలించాలని మార్కెట్ యార్డులో నెలకొని ఉన్న సమస్యను పరిష్కరించాలని హామీ ఇచ్చారు అయినా రైతులు మార్కెట్ యార్డును సందర్శించాలని తమ సమస్యలు తెలుసుకోవాలని పట్టుబట్టారు కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి ధాన్యం తరలించిన రైతులు పాల్గొన్నారు














