ఈతరం భారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 27 :
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చెంచు గిరిజన యువతీ యువకులకు సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవులను నమ్ముకొని జనజీవనానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలను ఒక్కచోటుకు చేర్చి, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ 111 మందికి సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.














