అచ్చంపేట ఆగష్టు 2 (ఈతరంభారతం ); : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ సంతోష్ సస్పెన్షన్ చేశారు. మండలంలోని అంకిరోనిపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బి కల్పన , అక్కరం పంచాయతీలో ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రత్లావత్ మక్తలాల్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. జూలై నెల డీఎస్‌ఆర్ యాప్‌లో నకిలీ ముఖ గుర్తింపు హాజరు ఇచ్చారని గుర్తించడంతో వారిద్దరిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించినందుకు చర్యలు తీసుకున్నారు
.














