ఈతరం భారతం/నకిరేకల్ /నవంబర్.9:
నేటి విప్లవ పరిస్థితులకు తగినట్లు భారత విప్లవానికి కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి రూపొందించి, ఆచరించిన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం మాత్రమే దిక్సుచికగా నిలిస్తుందని గ్రహించి, విప్లవ కారులందరు ఒకే సిపిఐ(ఎం.ఎల్) పార్టీ నిర్మాణం కింద ఐక్యం కావాలని వివిధ ఎం.ఎల్ గ్రూపులకు సిపిఐ(ఎం.ఎల్) కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ పిలుపునిచ్చారు. 2025, నవంబర్-9, ఆదివారం రోజు, నకిరేకల్ టౌన్, గుడిపాటి ఫంక్షన్ హాల్ లో సిపిరెడ్డి 41 వర్ధంతి సభ తెలంగాణ రైతు-కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం సైదులు అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి బుద్ద సత్యనారాయణ, ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.నర్సన్న, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సుదాకర్, పీఓడబ్ల్యూ(విముక్తి) సంపంగి పద్మ, వెలుగు వనిత, పి.సునీత, తెలంగాణ రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కొలిమి ప్రసాద్, పి.డి.ఎస్.యు.(ప్రభంజనం) దుబ్బ మదు, పివైఎల్ బానోత్ సంతోష్ నాయక్, బీసిపి లింగన్న, భహుజన మహాసభ చిట్టిపల్లి కాషిరాం మరియు పోత సునీత తదితరులు ఈసభలో పాల్గొని ప్రసంగించారు. సభకు ముందు అమరవీరుల అరుణపతాకాన్ని పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ ఆవిష్కరించారు. ఈసభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఇనుప సురేష్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కళారూపాలు సభికులను ఆకట్టుకున్నాయి.














